29-04-2025 09:29:20 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపో ముందు గంగాధర అనే ఆర్టీసీ డ్రైవర్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకి పాల్పడ్డాడు. ఇది గమనించిన తోటి ఉద్యోగులు అంబులెన్స్ ను పిలిపించి హుటాహుటిన బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా డిపో మేనేజర్ ను సిక్ లివ్ పై సంతకం చేయమని అడిగిన సంతకం చేయకపోవడంతో మనస్థాపాం చెంది ఆత్మయత్నానికి పాల్పడినట్లు డ్రైవర్ గంగాధర్ తెలిపారు. అనారోగ్యంతో డ్రైవింగ్ చేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడరాదని డ్రైవర్ తెలిపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని గంగాధర్ డిమాండ్ చేశారు.