calender_icon.png 29 March, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవర్‌పై దాడి ఆపై వాహనం చోరీ

23-03-2025 12:00:00 AM

ముగ్గురు నిందితుల అరెస్టు

రాజేంద్రనగర్, మార్చి 22 (విజయక్రాంతి): ఆటోలో ప్రయాణించి డ్రైవర్ పై దాడి చేసి వాహనాన్ని అపహరించిన ముగ్గురిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండు కు తరలించారు. కేసు వివరాలను శనివారం ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మేడిపల్లికి చెందిన బ్రహ్మ యాదవ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

ఈనెల 12న రాత్రి ఆయన ఉప్పల్ నుంచి రాపిడో రైడ్ లో భాగంగా ముగ్గురు వ్యక్తులను రాయన్నగూడ వైపు వాహనంలో ఎక్కించుకుని వస్తున్నాడు. రా త్రి 10 గంటలకు ఆటోలోని వ్యక్తులు మూత్రవిసర్జనకు అని చెప్పి వాహనాన్ని ఆపి బ్రహ్మయాదవ్‌పై దాడి చేసి ఆటోను అపహరించుకొని పో యారు.

మరుసటి రోజు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ముగ్గురు నింది తులను మహమ్మద్ రషీద్, షేక్ హసనుద్దీన్, మహమ్మద్ ఆరిఫ్‌లను అరెస్టు చేసి ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.