హన్మకొండ జిల్లా నయీమ్‌నగర్ పెద్ద మోరీపై రూ. 7 కోట్లతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. గత నెల రోజులు గా ఆటోలు, కార్లు, ప్రైవేట్ వాహనాలు రాకపోకలనూ సాగిస్తున్నాయి. కానీ, అధికారులు ఆర్టీసీ బస్సులను మాత్రం ఈ బ్రిడ్జి మీదుగా నడపడం లేదు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హనుమకొండ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, వేములవాడ ప్రాంతాలకు వెళ్లే బస్సులు వయా ములుగు రోడ్డు, పెద్దమ్మగడ్డ, హనుమాన్‌నగర్‌ల నుంచి వెళ్లవలసి వస్తున్నది. ఫలితంగా డబ్బులు అదనంగా చెల్లించడంతోపాటు సమయమూ వృథా అవుతున్నది. అధికారులు స్పందించి బ్రిడ్జి మీదుగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలి.
కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా