అగ్ని ప్రమాదంలో డ్రిప్ పైపులు దగ్ధం
24-05-2026 03:48 PM
బోథ్,(విజయక్రాంతి): శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన ఎలుక రాజు అనే రైతుకు చెందిన డ్రిప్ పైపులు దగ్ధమయ్యాయి. సర్వే నంబర్ 14లో గల తొమ్మిది ఎకరాల భూమిలో అండర్ గ్రౌండ్ పైపులైన్ తో పాటు డ్రిప్ పైపులను వేయడం జరిగింది. అయితే ఆకస్మికంగా జరిగిన ఈ అగ్ని ప్రమాద సంఘటనలో పైపులు కాళీ బూడిద అయ్యాయి. దీంతో రైతుకు నష్టం సంబంధించింది. అధికారులు సర్వే నిర్వహించి ఉపాధితో రైతుకు పరిహారమందే విధంగా చూడాల్సిన అవసరం ఉంది.






