07-02-2025 12:00:00 AM
హుజూర్ నగర్, ఫిబ్రవరి 6: సూర్యా పేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పులగంబండ తండాలో ప్రజలు తాగునీటి ఇబ్బంది పడుతున్నారు. తండాలో బోరు మోటార్ కాలిపోయి5 రోజులు గడుస్తున్న మరమత్తులు చేయించకపోవడంతో నీటి కటకట ఏర్పాడింది. అధికారులు పట్టించుకోకపో వడంతో గత్యంతరం లేక గిరిజన మహిళలు, చిన్నారులు పొలం గట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లి అతికష్టంపై వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.మోటార్కు మర మ్మతులు చేపట్టాలని అనేక సార్లు అధికారులకు విన్న వించినా పట్టించుకోవడం లేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.