హైదరాబాద్: జలమండలి పరిధిలోని పలు డివిజన్లలో గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. నగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజులకు విద్యుత్ సరఫరా చేసే పెద్దాపూర్, కంది 132కేవీ సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతులు చేపడుతున్నందున నీటి సరఫరా నిలిచిపోతుందని జలమండలి అధికారులు బుధవారం వెల్లడించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు మరమ్మతులు జరుగుతున్నందున పలు చోట్ల పూర్తిగా అంతరాయం కలుగుతుందని, మరి కొన్ని చోట్లలో ప్రెజర్‌తో నీటి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు.
పూర్తి అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
ఓఅండ్‌ఎం డివిజన్ 3లోని షేక్‌పేట్, ఓ అండ్ ఎం డివిజన్ 6లోని జూబ్లీహిల్స్, సోమాజీగూడ, బోరబండ, ఓఅండ్‌ఎం డివిజన్ 9 మూసాపేట్, ఓఅండ్‌ఎం డివిజన్ 15 నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్‌పేట్, ఓ అండ్ ఎం డివిజన్ 18 మణికొండ, నార్సింగి, మంచిరేవుల, ఓ అండ్ ఎం డివిజన్ 24లో తెల్లాపూర్, ఓ అండ్ ఆర్ డివిజన్ 8లోని బల్క్ కనెక్షన్లకు తీవ్ర అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఓ అండ్ ఎం డివిజన్ 3 భోజగుట్ట రిజర్వాయర్, ఓ అండ్ ఎం డివిజన్ 9లోని కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌లలో లోప్రెజర్‌తో అంతరాయం కలుగుతుందని చెప్పారు.