09-04-2025 04:08:04 PM
ఇతర పంపులు లీకేజీల మయం
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో 36 వార్డుల్లో మిషన్ భగీరథ పేరిట రోడ్లన్ని ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ వేస్తూ ఇంటింటికి కనెక్షన్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి కిన్నర సాని, సింగరేణి తదితర పైపులైన్లను కూడా ప్రోక్లిన్ తో తవ్వకాలు చేయటంతో అవన్నీ లీకేజీలమయమై, తాగునీరు రోడ్డు పాలవుతోంది. దీంతో ఆ పరిసర ప్రాంతాలంతా మురికి కాలువలను తలపించేలా ఉన్నాయి.
ఒకవైపు అధికారులు, ప్రభుత్వం నేటి వృధాను అరికట్టే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో తాగునీరు రోడ్డు పాలు అవుతోంది. పైపులను వేస్తున్నటువంటి క్రమంలో, చాలా చోట్ల లీకేజీలు ఏర్పడి నీరంతా వృధా అవుతుంది. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి, నీటి వృధాను అరికట్ట వలసిందిగా వేడుకుంటున్నారు స్థానిక ప్రజలు పైపులైన్ కాంట్రాక్టర్ని చరవాణి ద్వారా సంప్రదించగా,వెంటనే లీకేజీని సరిచేసి ప్రజలకు సమయానికి నీరు అందించే,ఏర్పాట్లు చేస్తామని,ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు చేపడతామని చెప్పారు.