07-03-2025 12:44:35 AM
మునుగోడు, మార్చి 6 : వేసవి దృష్ట్యా పట్టణాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అన్నిచర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు,చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులపై గురువారం హైదరాబాద్‌లో ఆయా మున్సిపాలిటీల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ జనాభా 2035 వరకు 2 లక్షలకుపైగా పెరుగుతుందని అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. చండూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణం, తాగునీటి పైపులైన్ల ఏర్పా టు, ఇతర అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు.
పనుల ప్రణాళికాబద్ధంగా వేగంగా పూర్తి చేయాలని నిధులకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు. రెండు మున్సిపాలిటీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని చెప్పారు.