calender_icon.png 29 April, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలి

29-04-2025 12:38:49 AM

  1.  ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 
  2.  మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష

పటాన్ చెరు, ఏప్రిల్ 28 :వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటిని సరఫరా చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపా ల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి, చిట్కుల్, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో తాగునీటి సరఫరాలో నెలకొన్న ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. 

సోమవారం క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ ఉన్నత అధికారు లు, మున్సిపల్ అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు.  జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో చేపడుతున్న పనుల మూలంగా తాగునీటి పైప్ లైన్ లు పగిలిపోవడం మూలంగా ప్రజలకు మంచినీటి సరఫ రా అంశంలో ఇబ్బందులు తలెత్తయని అధికారులు ఎమ్మెల్యే  దృష్టికి తీసుకొచ్చారు.

కా గా వేసవి కాలం కావడంతో ప్రజలు మంచినీటి అంశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని ఎమ్మెల్యే  తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సరఫరాను ప్రారంభించాలని ఆదేశించారు. పెరు గుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో నూతన మంచినీటి ట్యాంకుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ స్థానిక అధికారులు ప్రతిరోజు గ్రామీణ ప్రాం తాల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని కోరా రు.

రామేశ్వరం బండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్, ఇంద్రపురి కాలనీలలో జనాభాకు అనుగుణంగా మంచినీరు రావడంలే దని.. వెంటనే సరఫరాను  పెంచాలని ఆదేశించారు. దీంతోపాటు ఇంద్రేశం సత్యసా యి వాటర్ పంప్ హౌస్ సమీపంలో  నూత న ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యు త్ శాఖ అధికారులకు తెలిపారు.  ఈ సమావేశంలో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మిషన్ భగీరథ ఎస్ ఈ రఘువీర్, ఈ ఈ విజయలక్ష్మి, డీఈలు సుచరిత, శ్రీనివాస్, మున్సిపల్ ఏఈ మౌనిక పాల్గొన్నారు.

రూ.12 కోట్లతో ఇండోర్ సబ్ స్టేషన్  

పెరుగుతున్న జనాభాకు అణుగుణంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాల న్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణంలో రూ. 12 కోట్ల అంచనా వ్యయంతో 33/11 కేవీ ఇండోర్ స బ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూ డెం మహిపాల్ రెడ్డి తెలిపారు. 

పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో రూ. 12 కోట్లతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పటాన్ చెరు పట్టణంలో ఇండోర్ సబ్  స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.

పాశమైలారం నుండి నేరుగా నూతన సబ్ స్టేషన్ కి ప్రత్యేక లైను వేయడంతో పాటు పటాన్ చెరు,  రామచంద్రాపురం పట్టణాలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు.  అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ లో రూ.100 కోట్ల అంచనా వ్యయంతో 132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పటాన్ చెరు ఎంపీడీవో యాదగిరి, విద్యుత్ శాఖ ఏడీఈ లు సంజీవ్, నాగరాజు, రవికాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నివర్తి దేవ్, అంతిరెడ్డి, అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి, షకీల్, ఐలేష్, హమీద్, బాలకృష్ణ, తదితరులుపాల్గొన్నారు.