calender_icon.png 23 March, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

22-03-2025 05:14:12 PM

జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు...

బెల్లంపల్లి (విజయక్రాంతి): వేసవిలో గ్రామాలలో ఎక్కడ త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శనివారం బెల్లంపల్లి మండలంలోని సోమ గూడెం, ఆకెనపల్లి గ్రామపంచాయతీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డ్రై వేస్ట్ కలెక్షన్ లో భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించాలని ఆదేశించారు. సీసీ డ్రైన్స్ శుభ్రంగా ఉంచాలని, నర్సరీలలో మొక్కలను వెంటనే షిఫ్టింగ్, గ్రేడింగ్ చేయించాలని సూచించారు. వర్మీ కంపోస్ట్ తయారీని నిరంతరం చేపట్టాలని, స్మశాన వాటికల చుట్టూ పిచ్చి మొక్కలు పెరగకుండా చూడాలన్నారు. ఇంటి పన్ను వసూళ్లను 100శాతం పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని ఎంపీ ఓ వి. శ్రీనివాసును జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు ఆదేశించారు.