బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి గ్రామంలో గత వారం రోజులుగా త్రాగునీటి కొరతతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలోని కుర్మగూడెం, సుభాష్ రావు వాడల్లో వారం రోజులుగా త్రాగునీటి సరఫరా లేక పాట్లు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. రోజు తప్పి రోజు మిషన్ భగీరథ నీటిని విడవాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. తమ సమస్యను గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు గ్రామంలో తలెత్తిన సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.