‘విజయక్రాంతి’ కథనానికి స్పందన
కోనరావుపేట, ఫిబ్రవరి 1: పశువులు నీళ్లు తాగేందుకు పశువుల తొట్టిని శుభ్రం చేశారు. కొద్దిరోజులుగా నీటితోట్టిలో చెత్త,నాసు,పిచ్చి మొక్కలు చేరి నీరంతా కలుషితమయ్యాయి. కాగా శనివారం విజయక్రాంతి దినపత్రికలో ‘పశువుల నీటి తొట్టి.. నీళ్లు తాగితే ఒట్టు’ అనే శీర్షిక ప్రచురితమైంది. దీనిపై ఎంపిడివో శంకర్ రెడ్డి స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు పంచా యతీ కార్యదర్శి పశువుల నీటి తొట్టిని శుభ్రం చేయించి, శుభ్రమైన నీటిని తొట్టిలో నింపి పశువులకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు సిద్ధం చేశారు.