calender_icon.png 4 April, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇంటికి తాగునీరు అందించాల్సిందే

04-04-2025 12:38:44 AM

  1. నీటి ఎద్దడి కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకూడదు 
  2. పినపాక ఎంమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

పినపాక, ఏప్రిల్ 3 (విజయక్రాంతి):రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బం ది లేకుండా ఇప్పట్నుంచే తగిన చర్యలు చేపట్టాలని,వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.

గురువారం పినపాక మండల పరిషత్ కార్యాలయంలోవేసవి మంచినీటి ఎద్దడి.... నివారణ చర్యలు లో భాగంగా ముందస్తుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 23 గ్రామపంచాయతీలలో గల గ్రామాల్లో ఎన్నిరోజులకు తాగునీటి సరఫరా చేస్తున్నారని,భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్నందువలన నీటి సమస్య ఉత్పన్నమయ్యే గ్రామాలను గుర్తించి బోర్లను లోతు తవ్వడం, కొత్తబోర్లు అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించాలన్నారు.

పంచాయతీ కార్యదర్శులు నాలుగు రోజులలో ఆయా గ్రామాల్లో పనులు చేయించాలన్నారు. ముందస్తుగా అన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంకులు శుభ్రం చేసుకోవాలని, మంచినీటి పైపులను మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు.నూతన వాటర్ పైపులైన్స్ మంజూరు చేయడం కూడా జరిగిందన్నారు. వాటి పనులు త్వరగా ప్రారంభించడానికి సన్నాహాలు చేయాలని అధికారులను సూచించారు.ముందుగా క్షేత్ర స్థాయిలో తాగునీటి సరఫరా పరిస్థితి గురించి సంబంధిత సెక్రటరీలను, అధికారులు స్పెషల్ ఆఫీసర్ లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా తీరును ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీల్, తాసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బ్రహ్మ దేవ్, గ్రిడ్‌ఏఈ మహేందర్ రెడ్డి, 23 గ్రామ పంచాయతీల సెక్రటరీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.