calender_icon.png 27 September, 2024 | 8:52 PM

తాగునీరు వృధా అయ్యేను చూడు

09-09-2024 10:14:05 AM

అధికారుల నిర్లక్ష్యంతో నేలపాలవుతున్న తాగునీరు 

భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మిషన్ భగీరథ తాగునీరు నేలపాలవుతోంది. స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికి అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ మంచినీటి పథకంపై పరవేక్షణ కొరవడింది అనడానికి చక్కని నిదర్శనం ఈ దృశ్యం. మెయిన్ పైపులైను ఆన్ చేసిన తర్వాత ట్యాంకు నిండిన వెంటనే పైపులను ఆఫ్ చేయాల్సి ఉంది. కానీ ఆన్ చేసి వదలడంతో ట్యాంకు నిండి వృధాగా నీరంతా పొర్లిపోతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా మిషన్ భగీరథ పథకంపై పర్యవేక్షణ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.