10 June, 2026 | 3:13 AM

రాజీవ్ గృహకల్పలో తాగునీటి సౌకర్యం కల్పించాలి

10-06-2026 12:46 AM

మేడ్చల్, జూన్ 9 (విజయక్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గంలోని కౌకూరు రాజీ వ్ గృహకల్ప సముదాయంలో నీటి సౌక ర్యం కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్‌కు వినతిపత్రం అందజేశారు. మౌలా లి ఆయుష్ వెల్నెస్ సెంటర్, యునాని హాస్పిటల్ పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలం లో మౌలాలి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, అల్వాల్ ప్రాంతంలోని భూధాన్ ల్యాండ్స్ సర్వే నంబర్లు 537, 538, 539, 540లలో పేద ప్రజల గృహ అవసరాల దృష్ట్యా 2BHK గృహాల నిర్మాణం చేపట్టాలని కోరారు.

నేరేడ్మెట్ డివిజన్ రామకృష్ణాపురంలోని సర్వే నంబర్ 246లో ఉన్న ప్రభుత్వ స్థలంలో 2BHK గృహాలను నిర్మించాలని,  సీబీఎన్ కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న వాంబే గృహ సముదాయాన్ని కూల్చివేసి ఆధునిక సౌకర్యాలతో పునర్నిర్మాణం చేపట్టాలన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ సానుకూలంగా స్పందించారని, సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రాము యాదవ్, వెంకన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు.