29-03-2025 09:04:00 PM
ఎల్బీనగర్: కొత్తపేట డివిజన్ లోని రాజీవ్ గాంధీనగర్ ఫేజ్-2 కాలనీలో డ్రైనేజీ నీరు కలవడంతో తాగునీరు కలుషితం అవుతుందని కాలనీ వాసులు పేర్కొన్నారు. సమస్యపై స్థానికులు కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆయన కాలనీలో పర్యటించి, సమస్యను పరిశీలించారు. రాజీవ్ గాంధీ నగర్ లో కలుషిత నీటి సమస్యను వెంటనే పరిశీలించాలని, కలుషిత నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులతో మాట్లాడి కోరారు. కాలనీ వాసులకు తాగడానికి మంచి నీటి ట్యాంకర్ పంపించాలని ఏఈ స్రవంతిని కోరారు.