calender_icon.png 18 April, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైపులైన్ లీకేజీలతో త్రాగునీరు కలుషితం

10-04-2025 11:16:02 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): సింగరేణి త్రాగునీటి పైపులైన్‌ లీకేజీతో తాగునీరు కలుషితమవుతున్నాయని అబ్రహం నగర్, సర్దార్ వల్లభాయ్ నగర్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పైపులైన్లకు కాలం చెల్లిపోవటంతో పైపులకు రంద్రాలు పడ్డయని, అలాగే డ్రైనేజీ కాలువలో ఉన్న మంచినీటి పైప్‌లైన్‌ లీకేజీ కావడంతో నీరంతా కలుషితమవుతున్నాయని వాటివల్ల తాము అనారోగ్యం బారిన పడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీల్లో పైపులైన్లు మరమ్మత్తు చేసి డ్రైనేజీ నీరు మంచినీటి పైప్‌లైన్‌లో కలువకుండా చర్యలు తీసుకోవాలని కార్మికవాడ ప్రజలు అధికారులను కోరుతున్నారు.