calender_icon.png 4 February, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి

03-02-2025 08:22:54 PM

కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్..

ఎల్బీనగర్: నాగోల్ డివిజన్ లోని వివిధ కాలనీల్లో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని జలమండలి అధికారులను కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ కోరారు. ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని సోమవారం కలిసి డ్రైనేజీ, తాగునీరు, డ్రైనేజీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. నాగోల్ డివిజన్ లోని రామాంజనేయులు కాలనీ, నర్సింహస్వామి కాలనీ ఫేస్ -2, సాయి సప్తగిరి కాలనీ, శ్రీనివాస కాలనీలతో పాటు ఇతర కాలనీలకు డ్రైనేజీ లైన్ మంజూరు చేయాలని కోరారు. నాగోల్ డివిజన్ లో 25 ఏండ్ల క్రితం వేసిన డ్రైనేజ్ లైన్లు పాడైపోయి నిరంతరం రోడ్ల మీదకి డ్రైనేజీ నీళ్లు పారుతున్నాయని వివరించారు.

దీంతో డివిజన్ ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాత పైపులైన్ తొలిగించి నూతన డ్రైనేజ్ లైన్ లను ఏర్పాటు చేయాలని కోరారు. కొన్ని కాలనీలో తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటి సరఫరాకు డయా పైపులైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలనీల్లో జలమండలి అధికారులు వేసిన డ్రైనేజ్ లైన్ పనులు పూర్తిచేసి నెలలు గడుస్తున్నా ఇంకా రోడ్లు మరమ్మతులు చేయడం లేదని, రోడ్లన్నీ గుంతలుగా ఏర్పడి ప్రజలు నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రైనేజ్ లైన్ పనులు పూర్తయిన చోట వెంటనే రోడ్లు మరమ్మతులు చేయించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కోరారు.