12-04-2025 01:26:57 AM
ఇల్లు ఒళ్లు గుల్లచేసుకొని కాసులన్నీ దవాఖానకు ఇచ్చేద్దాం!!
తెలంగాణలో పెరుగుతున్న లిక్కర్ కిక్కు
* వారు నలుగురు అన్నదమ్ము లు. అంతా యాభైఏళ్లలోపు వారే. తాపీ పనిచేస్తారు. రోజూ సాయం త్రం చీప్ లిక్కర్‌కు బానిసయ్యారు. వారిలో ఇద్దరి లివర్ పూర్తిగా చెడిపోయింది. వారిద్దరిని బతికించుకునేం దుకు కుటుంబ సభ్యులు అనేక దవాఖానాలు తిరిగారు. అప్పు చేసి, లక్షలు ఖర్చు పెట్టారు. అయినా, వారు బతకలేదు.
* ఇంటి కిరాయి కట్టలేక, చిన్న పిల్లలను చదివించుకోలేక, ఇప్పుడు ఆ రెండు కుటుంబాల్లో తల్లులు దేవుడా మాకీ శిక్ష ఏమిటి? అని రోజూ ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో మద్యానికి బానిసలైన అనేక మంది కుటుంబాల వేదన ఇది.
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): అంతకంతకు పెరుగుతున్న లిక్క ర్ భూతం రాష్ట్ర భవిష్యత్తును చీకటిమ యం చేస్తున్నది. అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమౌతున్నాయి. మద్యానికి బానిసలై మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఆర్థిక, అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే చితికిపోతున్నాయి. కుటుంబాన్ని పోషించేవారులేక పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతున్నది.
ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వాలు లిక్కర్ అమ్మకాల జోరును పెంచేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నది. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ఆదాయమే పెద్ద దిక్కుగా ఉంది. సర్కార్‌కు వివిధ మార్గాల్లో ఆదాయం వస్తున్నప్పటికీ ప్రధానంగా లిక్కర్ నుంచే ఎక్కువగా ఆదా యం సమకూరుతున్నది. ఏ పార్టీ ప్రభుత్వమైనా లిక్కర్ అమ్మకాలతో యేటా అమ్దానీ పెంచుకుంటోంది.
రాష్ట్ర విభజన తర్వాత దశాబ్ద కాలంలోనే మూడు రెట్లకు పైగా లిక్కర్ ఆదాయం పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాలకు గాను రాష్ట్ర విభజన నాటికి అంటే 2013-14లో రూ. 9,100 కోట్ల ఆదాయమే వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 2015-16 సంవత్సరంలో తెలంగాణలోని 10 జిల్లాలలో రూ. 12,706 కోట్ల ఆదాయం రాగా, 2024-25 సంవత్సరం వచ్చేసరికి రూ. 34,600 కోట్లకు చేరింది.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలతో ఎక్కువగా ఆదాయం పెంచుకునేందుకు ఫోకస్ పెట్టింది. అందుకు సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో 2,620 వరకు మద్యం షాపులు, 1,171 బార్లు ఉన్నాయి. ఒక్కో బారు నుంచి ఏడాదికి రూ. 40 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇక మద్యం షాపుల పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చి.. అదనంగా రూ. లక్ష వరకు ఎక్సైజ్ శాఖ వసూ లు చేస్తోంది.
గత పదేళ్ల నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరానికి అబ్కారీ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 2.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 2015- 16లో లిక్కర్ ఆదాయం రూ. 12,706.35 కోట్లు ఉంటే.. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి గాను అబ్కారీ శాఖ నుంచి సర్కార్‌కు రూ. 34,600 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా ప్రతి ఏటా రూ. 2 వేల కోట్ల నుంచి రూ. 3 వేల కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు ఆదా యం పెరుగుతూ వస్తోంది.
అదే 2023-24 సంవత్సరంలో రూ.34,800.07 కోట్ల ఆదా యం వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ. 36,493.07 కోట్ల ఆదాయంలో.. అప్పుడు కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల రూపంలో వచ్చిన రూ.264.50 కోట్లు కూడా కలిశాయి. అయితే 2025-- - ఆర్థిక సంవ త్సరానికి సుమారుగా 40 వేల కోట్లకు పైగా ఆదా యం పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.
ఊరూరా 5 నుంచి 10 వరకు బెల్ట్‌షాపులు
రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉండగా, 1,171 వరకు బార్లతో పాటు క్లబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా మరో 40 బార్లను పెంచాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం వరకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అంతే కాకుండా రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలుండగా, ఒక్కో గ్రామంలో అనధికారికంగా 5 నుంచి 10 వరకు బెల్ట్‌షాపులున్నాయి.
మొత్తంగా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా లక్షకు పైగా బెల్ట్‌షాపులు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. బెల్ట్‌షాపుల విషయంలో ఎక్సైజ్ శాఖ చూసిచూడనట్లుగానే వ్యవహారిస్తోంది. రాష్ట్రంలో అనుమతిలేని మద్యాన్ని విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలకు దిగుతోంది. మండల కేంద్రాలు, పట్టణాల్లో ఉన్న వైన్‌షాపులకు వచ్చి మద్యం కొనుగోలుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపరని, దాంతో సర్కార్‌కు ఆదాయం తగ్గుతుందనే అభిప్రాయంతో ఉన్నారు.
గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉంటే లిక్కర్ వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని, తద్వారా ఆదాయం పెరుగుతుందని సంబంధిత శాఖ వర్గాలు చెబుతున్నాయి. అందుకు బెల్ట్‌షాపులపై ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారనే స్థానికుల నుంచి విమర్శలు ఉన్నాయి.
మద్యం విక్రయాల్లో తెలంగాణది మొదటి స్థానం
మద్యం విక్రయాల్లో దక్షిణ భారత దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) స్పష్టం చేసింది. రాష్ట్రంలో గతేడాది ఒక్కో వ్యక్తి సగటున మద్యం కోసం రూ. 1,623 ఖర్చు చేసినట్లుగా ఆ సంస్థ పేర్కొన్నది. అంటే గత ప్రభుత్వం హయాంలో కంటే ప్రస్తుత సర్కార్ హయాంలోనూ లిక్కర్ అమ్మకాలు పెరడం వల్ల ప్రజలకు మద్యం ఖర్చులు కూడా పెరిగాయని చెబుతున్నారు.
రాష్ట్రం లో గుడుంబా, గంజాయి నియంత్రణను పకడ్బందీగా అమలు చేయాలని.. తద్వారా లిక్కర్ అమ్మకాలు పెరుగుతాయని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇదుకు సంబంధించి జిల్లాల వారిగా ప్రతి నెల నిర్ణయించినా టార్గెట్లను చేరుకునేలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.