calender_icon.png 16 March, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో మజ్జిగ త్రాగండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండి

15-03-2025 08:24:18 PM

భద్రాచలం ఆర్టీసీ డీఎం..

భద్రాచలం (విజయక్రాంతి): వేసవి వేడిమిని తట్టుకోవడానికి మజ్జిగ త్రాగడం ఎంతో మేలని ఆర్టీసీ డిపో మేనేజర్ తిరుపతి తెలిపారు. శనివారం ఆయన ఆర్టీసీ డిపో పరిధిలోని ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ రోజు నుండి ప్రతి రోజు ఉదయం 11:30 గంటల నుంచి డిపో గేట్ వద్ద (సెక్యూరిటీ వద్ద) ఉచితంగా మజ్జిగ పాకెట్లు పంపిణీ చేయబడతాయి" అని తెలిపారు. వేసవిలో ఒంటిలో తేమను కాపాడుకోవడానికి, వేడికి గురికాకుండా ఉండేందుకు మజ్జిగ అత్యంత ఉపయోగకరమైన పానీయం అని పేర్కొంటూ, ప్రతి ఉద్యోగి సంస్థ అందించే మజ్జిగ ప్యాకెట్లను వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.