పటాన్ చెరు, జనవరి 24 : పటాన్ చెరు పరిధిలోని ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఉదయం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ తెలిపారు. ట్రాఫిక్ వారోత్సవాలలో భాగంగా ఎస్సై ఆంజనే యులు పోలీస్ సిబ్బందితో కలిసి 20 ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు ముత్తంగి చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారని చెప్పారు. విధుల్లోకి వచ్చే ముందే డ్రైవర్లకు పాఠశాల యాజమా న్యాలు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని సీఐ సూచించారు.