28-04-2025 01:01:42 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : అది ఓ గ్రేడ్ వన్ స్థాయికి ఎదిగిన మున్సిపాలిటీ... పచ్చదనం కోసం కోట్ల రూపాయ లు వెచ్చించిన అధికారుల నిర్లక్ష్యం... ప్రజా ప్రతినిధుల అలసత్వం వెరసి పచ్చదనం కాస్త కళావిహీనంగా దర్శనమిస్తోంది.
ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే చౌరస్థల నిర్వహణ లేక అధ్వాన్నంగా మారాయి. పట్టణంలోని పలు చౌరస్తాల్లో పండిపోయిన గడ్డితో, రహదారుల మధ్య డివైడర్‌లో ఎండిపోయిన చెట్లు పట్టణ అందాన్ని వెక్కిరిస్తున్నాయి. పాలక వర్గంలో అదే పరిస్థితి, ప్రత్యేక అధికారుల పాలనలో అదే దుస్థితి... ఇది ప్రస్తుత ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పరిస్థితి.
కళావిహీనంగా చౌరస్తాలు..
ప్రజలకు పచ్చదనాన్ని ఆహ్లాదాన్ని అం దించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో కోట్లాది రూపాయలను వెచ్చించి పట్టణంలోని అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్, స్వామి వివేకానంద చౌక్, కొమరం భీమ్ చౌక్, తెలంగాణ తల్లి చౌక్ లను పునరుద్ధరించారు.
ఐతే చౌక్‌ల పున:ప్రారంభం అయిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే చౌరస్తాలు పచ్చదనంతో కళకళలాడుతూ వాటర్ ఫౌం టెన్లతో ప్రజలకు హాల్లాదాన్ని పంచాయి. ఆ తర్వాత పాలకవర్గము ఉన్నప్పటికీ చౌరస్తాల నిర్వహణ తీరు పట్టించుకోకపోవడంతో అప్పటి వరకు పచ్చదనం, వాటర్ ఫౌంటెన్లతో కళకళలాడిన చౌరస్తాలు అంతలోనే కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి.
ప్రత్యేక అధికారుల పాలనలో అదే దుస్థితి...
మున్సిపాలిటీల్లో పాలకవర్గాల కాలపరిమితి జనవరి 26వ తేదీతో ముగిశాక ప్రత్యే క అధికారుల పాలన మొదలయ్యింది. ప్రత్యే క అధికారుల పాలన మొదలై 4 నెలలు గడిచినప్పటికీ పట్టణ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. పాలకవర్గంలో ఉన్నప్పటి దుస్థితే, ప్రస్తుత ప్రత్యేక అధికారుల పాలనలో కనబడుతోంది.
అటు అభి వృద్ధి ని ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోతే కనీసం అధికారులైన పట్టించుకుంటా రని ఎంతో ఆశతో ఉన్న ప్రజలు పాలకవర్గ పాలన సమయంలో, ప్రత్యేక అధికారు ల పాలన సమయంలో తేడా లేకపోవడంతో ప్రజలు విసుకు చెందుతున్నారు.
పత్తాలేని ప్రత్యేక అధికారి
ఆదిలాబాద్ మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి జనవరి 26వ తేదీతో ముగియడం తో మునిసిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన మొదలయ్యింది. దీంతో ఆదిలాబాద్ కు మున్సిపాలిటీకి ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజె క్టు అధికారి కుష్బూ గుప్తాను ప్రత్యేక అధికారిగా నియమించారు.
బాధ్యతలను స్వీక రించిన నటి నుండి నేటి వరకు ప్రత్యేక అధికారి అయిన ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా మునిసిపాలిటీ రాకపోగా కనీసం మున్సిపల్ అధికారులతో ఒక్క సమావేశం సైతం నిర్వహించలేదంటే ప్రత్యేక అధికారుల పాలనలో మున్సిపాలిటీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టి అర్థమవుతుంది.
వేసవిలో చెట్లు ఎండడం సహజం..
వేసవి కాలంకు తోడు ఆదిలాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా చెట్లు ఎండిపోవడం సహజమే. కానీ కోట్లు వెచ్చించి చౌరస్తాల్లో వేసిన పచ్చని గడ్డిని, డివైడర్ల నిర్మాణ సమయంలో నాటిన మొక్కలను రక్షించేందుకు అక్కడక్కడ మంచినీటి పైప్ లైన్ సదుపాయాన్ని సైతం కల్పించారు. కానీ మున్సిపల్ కమిషనర్ లేదా సంబంధిత విభాగం అధికారులు గానీ ఇంతవరకు చౌరస్తాల్లోని పచ్చదనం కాపాడేందుకు డివైడర్ల మధ్య ఉన్న మొక్కలను రక్షించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీ యం.
తెలంగాణ తల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ వాటర్ ఫౌంటెన్ సైతం మూన్నా ళ్ళ ముచ్చట గాని నిలిచిపోయింది. కొమరం భీమ్ చౌరస్తా పచ్చని గడ్డి పూర్తిగా ఎండిపో యి గోధుమ రంగుకు మారింది. ప్రతి రోజు ఈ చౌరస్తా మీదుగా జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తారని తెలిసిన మున్సిపల్ అధికారులకు చీమ కుట్టినట్లయినా అనిపించడం లేదు.
ఎండిపో యిన చెట్లు, కళావిహీనంగా కనిపిస్తున్న చౌరస్తాలతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం కనుమ రుగవుతోంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలో కరువైన పచ్చదనం, ఆహ్లాదాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.