calender_icon.png 15 November, 2024 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లో దుస్తుల..డ్రెస్ కోడ్ పోలీసింగ్@డెల్టా ఎయిర్ లైన్స్

18-09-2024 04:58:40 PM

ముంబై: ఉద్యోగానికి హాజరయ్యే అభ్యర్థులు హుందాగా ప్రొఫెషనల్ గా కనిపించాలి సరే. కానీ సరైన అండర్ గార్మెంట్స్,లో దుస్తులు తదితరాల విషయంలో మార్గదర్శకాలు వివరించింది. ఈ మేరకు డ్రెస్ కోడ్ పోలీసింగ్ తో కఠిన నిబంధనలను తెలుపుతూ డెల్టా ఎయిర్ లైన్స్ కంపెనీ మెమో జారీ చేసింది. ఇదెక్కడి వింత! అని పలువురు ముక్కున వేలేసుకుంటున్న వైనం చూస్తున్నామని నెటిజెన్లు పేర్కొంటున్నారు.

‘అప్పియరెన్స్ రిక్వైర్ మెంట్స్ అక్నాలెడ్జ్ మెంట్’..
ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా పద్ధతిగా డ్రెస్ చేసుకోవాలని డెల్టా కంపెనీ సూచించింది. అభ్యర్థి డ్రెస్సింగ్ ప్రొఫెషనల్ గా హుందాగా ఉండాలని పేర్కొంది. అంతేకాదు, లోదుస్తుల విషయంలోనూ జాగ్రత్త వహించాలని, సరైన అండర్ గార్మెంట్స్ ధరించాలని పేర్కొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ లోదుస్తులు బయటకు కనిపించేలా ఉండకూడదనీ, మహిళా అభ్యర్థులు మరీ కురచ స్కర్టులు ధరించి రాకూడదనీ సూచిస్తూ ‘అప్పియరెన్స్ రిక్వైర్ మెంట్స్ అక్నాలెడ్జ్ మెంట్’ పేరుతో ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో.. తమ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ కు భంగం కలిగించకుండా ఉండేందుకే ఈ సూచనలు చేసినట్లు డెల్టా కంపెనీ వివరణ ఇచ్చింది.