22-04-2025 01:34:39 AM
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వడ్లు
హుస్నాబాద్, ఏప్రిల్ 21 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సోమవారం సాయంత్రం కూ డా గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారి గా గాలితో కూడిన వాన కొనుగోలు కేంద్రాల్లో వడ్లను నీళ్లపాలుచేసింది. హుస్నాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్లు తడిసిపోయాయి. మూడు రోజుల క్రితం కూడా అక్కన్నపేట మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పల్లెలను అతలాకుతలం చేసింది.
కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోయా యి. ప శువుల కొట్టాలు గాలికి లేచిపోయాయి. మామిడిచెట్లు నేలకూలాయి. అక్కన్నపేట, రేగొం డ, మల్లంపల్లి, మోత్కులపల్లిలో కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో రైతుల వ డ్లు నీటిపాలయ్యా యి. అకాల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినా ఆఫీసర్లు అలర్ట్ కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తడిసిన వడ్లను కూడా కొనాలె
అకాల వానలకు తడిసిపోయిన వడ్లను కూ డా కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ హు స్నా బాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలే ని మల్లికార్జునరెడ్డి డిమాండ్ చేశారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వానకు తడిసిన వడ్ల ను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని డిమాండ్ చేశారు.
మార్కెట్ యార్డు లో సరైన సౌకర్యా లు లేకపోవడం వల్లే వర్షపు నీరు నిలిచిపోయిందని, రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట నీళ్లపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేకుంటే రైతు ల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుంది‘ అని అన్నారు.ఆయన వెంట ఆ పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు అన్వర్ పా షా, నాయకులు అయిలేని శంకర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు మేకల వికాస్, రవీందర్ తదితరులున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో వడగండ్లు
గజ్వేల్, ఏప్రిల్ 21: గజ్వేల్ నియోజకవర్గంలో సోమవారం రాళ్లవాన బీభ త్సం సృష్టించింది. జగదేవపూర్ మండలంలో పలుచోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, కోళ్ల ఫారాలు పలు దుకాణాల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పలుచోట్ల ఆస్తి నష్టం సంభవించింది.
మండల పరిధిలోని పీర్లపల్లిలో భారీ స్థాయిలో రాళ్లవాన కురిసిం ది. ములుగు మండలం బస్వాపూర్ లో కురుమ రామాంజనేయులు ఇంట్లొ పిడు గు పడి ఇళ్లు ధ్వంసం అయింది. ఇంట్లో ఉన్న మహిళకుస్వల్ప గాయాలయ్యాయి. రాళ్లవానకు దెబ్బతిన్న పంటలను మంగళవారం కలెక్టర్ మను చౌదరి పరిశీలిం చనున్నారు.