calender_icon.png 8 November, 2024 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండా ముంచిన వాన

14-05-2024 02:10:33 AM

అకాల వర్షాలతో అన్నదాత అతలాకుతలం

కోత కొచ్చిన పొలాల్లో చేరిన వర్షపు నీరు

కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో తడిసిన ధాన్యం

జయశంకర్ భూపాలపల్లి, మే13 (విజయక్రాంతి): అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. మళీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో ఆగం అవుతున్నాడు. ఆరుగాలం శ్రమించి చేతికచ్చిన వరి పంట కల్లాలు, పొలాల్లో కం డ్లముందే కొట్టుకుపోతుంటే రైతన్న కన్నీరు మున్నీరవుతున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వేలాది ఎకరాల్లో వరిపంట నేలమట్టం అయ్యింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటి పాలయ్యింది. దీంతో అన్నదాతకు భారీగా నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన పొలాల్లో వర్షపు నీరు చేరడంతో వరిగింజలు మురిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందో ళన వ్యక్తంచేశారు. వడగండ్లకు 60 శాతం వరకు గింజలు పొలంలోనే రాలిపోగా, కల్లాల్లో ఉన్న పంట వర్షార్పణం అయ్యిందని లబోదిబోమంటున్నారు. నేలవారిన వరి కోతలకు అధిక ఖర్చవుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం అందేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.