calender_icon.png 11 January, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలాలకు పదును పెట్టాలి

11-01-2025 01:07:04 AM

మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ సిటీబ్యూరో,జనవరి 10(విజయక్రాంతి) : తెలంగాణలోని కవులు తమ కలాలకు పదును పెట్టాలని, కళాకారులు గళాలు విప్పాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విధ్వంస జీవన విధానం, సాంస్కృతిక చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేధావులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డా. జీ వెన్నెల, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజలా, ప్రముఖ కవి జయరాజు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రముఖ కవి, రచయిత సుద్దాల అశోక్‌తేజ, తెలంగాణ భాషా, సాంస్కృతిక సంచాలకులు డా.మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ డా.బాలచారి, పద్మశ్రీ ఎక్క యాదగిరి, పద్మశ్రీ మహమ్మద్ అలీబేగ్, పద్మశ్రీ పద్మజా రెడ్డి పాల్గొన్నారు.