calender_icon.png 19 January, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రీమ్ సాంగ్ రిలీజ్

06-08-2024 12:05:00 AM

బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’. శతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి డ్రీమ్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పాటకు బండి సరోజ్ ఆకట్టుకునేలా లిరిక్స్ రాసి కంపోజ్ చేయగా, శ్రీవైష్ణవి గోపరాజు పాడారు. ‘వచ్చాడులే పరాక్రమం.. నా కన్నె మనసు చేరే కొత్త సంగమం.. తెచ్చాడులే పరాక్రమం.. నా చిట్టి గుండెలోకి వింత యవ్వనం..’ అంటూ అమ్మాయి తన మనసులోని తొలిప్రేమ భావాలను చెప్పేలా లవ్ ఫీల్‌తో సాగుతుందీ పాట. ఈ చిత్రం ఇదే నెల 22న రిలీజ్ కానున్నది.