నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఐకెపి సంఘాల కమ్యూనిటీ వర్కర్ల క్యాలెండర్ 2025 ను డీఆర్డీఓ విజయలక్ష్మి సోమవారం ఆవిష్కరించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో క్యాలెండర్ను ఆవిష్కరించిన అధికారి ఈ సంవత్సరం మహిళా సంఘాలకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష మేరకు రుణాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఏల సంఘం నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.