calender_icon.png 2 February, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన డిఆర్డిఏ సిబ్బంది..

29-01-2025 07:49:24 PM

పాపన్నపేట: గత మూడు నెలలుగా వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణమే మూడు నెలలకు సంబంధించిన వేతనాలను విడుదల చేయాలని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో మండలాల్లో నిరసన ప్రదర్శనలు చేసేందుకుగాను రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు నేడు జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీడీవోలకు జీతాలకు సంబంధించి వినతి పత్రాలను సమర్పించారు. అలాగే జిల్లా కార్యాలయంలోని డిఆర్డిఏ సిబ్బంది నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరై తమ నిరసనను తెలియజేశారు.

గత మూడు నెలల నుండి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్యాలయాలకు విధులకు హాజరు అయ్యేందుకు కూడా పెట్రోల్ కు ఇతర చార్జీలకు డబ్బులు సర్దుబాటు కాక తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నామని ఈ సందర్భంగా ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసి ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను విజయవంతం చేశామని ఈ సందర్భంగా వారు వివరించారు. కావున ప్రభుత్వం తమ ఆవేదనను పట్టించుకోని తక్షణమే వేతనాలను విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, డిఆర్పి సంతోష్ కుమార్, జిల్లా ప్లాంటేషన్ సూపర్వైజర్ శ్రవణ్ కుమార్, పిఓ శశిరేఖ, కంప్యూటర్ ఆపరేటర్లు ముజీబ్, శ్యాం ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్లు శ్రీనివాస్ రాజశేఖర్ తో పాటు ఇతర డిఆర్డిఏ సిబ్బంది పాల్గొన్నారు.