ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
సింగపూర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరిగిన ఎనిమిదో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. బుధవారం జరిగిన ఎనిమిదో గేమ్‌ను 51 ఎత్తుల వద్ద గుకేశ్, లిరెన్ డ్రాకు అంగీకరించారు.
మరో ఆరు గేమ్‌లు మిగిలిఉన్న నేపథ్యంలో ఇద్దరు చెరో 4 పాయింట్లతో కొనసాగుతున్నారు. గుకేశ్, లిరెన్‌లో తొలుత ఎవరు 7.5 పాయింట్లు సాధిస్తే వారిని విజేతగా ప్రకటించనున్నారు. ఇప్పటివరకు జరిగిన 8 గేముల్లో తొలి గేమ్‌ను లిరెన్.. మూడో గేమ్‌ను గుకేశ్ గెలుచుకున్నారు. మిగతా అన్ని గేమ్‌లు డ్రాగా ముగిశాయి.