ఆసీస్‌తో సిరీస్‌కు సుమిత్ ఎంపిక
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సుమిత్ ద్రవిడ్ టీమిండియా అండర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న వన్డే, టెస్టు సిరీస్‌కు సుమిత్‌ను బీసీసీఐ శనివారం ఎంపిక చేసింది. ఇటీవలే కర్ణాటక లీగ్‌లో అదరగొట్టిన సుమిత్‌కు అండర్ పిలుపు రావడంతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. సెప్టెంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో భారత జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో పుదుచ్చేరి వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఆ తర్వాత చెన్నై వేదికగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 7న నాలుగు రోజులు టెస్టు మ్యాచ్ సిరీస్ ఆడనున్నారు. వన్డే జట్టుకు మహమ్మద్ అమన్ నాయకత్వం వహించనుండగా.. నాలుగు రోజుల మ్యాచ్‌లకు సోహమ్ పట్వా కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ ఏడాది కూచ్‌బెహర్ ట్రోఫీలో కర్ణాటక విజయం సాధించడంలో సుమిత్ కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 362 పరుగులు సాధించిన సుమిత్ బౌలింగ్‌లోనూ 16 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుతం కేఎస్‌సీఏ మహరాజా టీ20 ట్రోఫీలో ఆడుతున్న సుమిత్ ఏడు ఇన్నింగ్స్‌లు కలిపి 82 పరుగులు సాధించాడు.