calender_icon.png 28 October, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్రవిడమే మా సిద్ధాంతం

28-10-2024 01:07:25 AM

  1. ప్రజలు వెంట ఉంటారనే నమ్మకంతోనే రాజకీయాల్లోకి
  2. అధికార డీఎంకే, బీజేపీలపై విమర్శలు
  3. అధికారం పంచుకోవడానికి సిద్ధం
  4. రాష్ట్రస్థాయి సమావేశంలో స్పష్టం చేసిన విజయ్

చెన్నై, అక్టోబర్ 27: తమిళ అగ్ర హీరో విజయ్ తమిళనాడులోని విల్లుపురమ్ జిల్లా విక్రవండి ప్రాంతం కేంద్రంగా ఆదివారం తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ మొట్టమొదటి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించా రు.

ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. లక్షలాది మంది ప్రజలు సభకు తరలివచ్చారు. ఈ సమావేశంలో దళపతి తన పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేశారు. అంతేకాకుండా 2026 అసెంబ్లీ ఎన్నిక లు గురించి ప్రస్తావించారు. అధికారం పంచుకునే విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

లౌకిక సామాజిక న్యాయమే ధ్యేయం

విజయ్ సభప్రాంగణానికి చేరుకున్న వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన ర్యాం ప్‌పై పరుగులు తీస్తూ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం అక్క డ ఏర్పాటు చేసిన పార్టీ జెండాను రిమో ట్ తో ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే స్వాతం త్య్ర సమరయోధులు, మాతృభాష కోసం పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వారి చిత్ర పటాలకు నివాళులర్పించారు.

అనంతరం సభలో విజయ్ మాట్లాడుతూ.. ద్రవిడ  సిద్ధాంతమే మా పార్టీ సిద్ధాంతమని ప్రకటించారు. పెరియర్ ఈవీ రామస్వామి, కే కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నచియార్, అంజలై అమ్మాళ్ వంటి ప్రముఖులు చూపిన తోవలో పార్టీని నడుపుతాన ని, లౌకిక సామాజిక న్యాయమే ధ్యేయంగా పని చేస్తానని ఆయన పేర్కొన్నారు. 

భవిష్యత్తును ఫణంగా పెట్టి.. 

సినిమాల పరంగా తన కేరీర్ మంచి స్థాయిలో ఉందని దళపతి విజయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. డబ్బులు బాగా సంపా దించే అవకాశం ఉన్నప్పటికీ వాటన్నింటినీ వదిలి రాజకీయాల్లోకి వొస్తున్నటుట చెప్పా రు. ప్రజలు తనకు అండగా ఉంటారనే నమ్మకంతోనే భవిష్యత్తును ఫణంగా పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేశారు. కొంత మంది తనను ఆర్టిస్ట్ అంటూ విమర్శించారని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎంజీఆర్‌లు కూడా సినిమా ఆర్టిస్టులే అన్న విషయాన్ని మర్చిపోవద్దన్నా రు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీట్ పరీక్షకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీ పార్టీలపై దళపతి విరుచుకుపడ్డారు. తనకు రాజకీయ అనుభవం లేనప్పటికీ పాలిటిక్స్ విషయంలో భయపడటం లేదని పేర్కొన్నారు.

అధికారం పంచుకునే విషయంలో కీలక వ్యాఖ్యలు

2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించిన విజయ్ దళపతి.. ఎన్నికల్లో సింగల్ మెజారిటీతో తమ పార్టీకి పట్టం కడతారనే ధృడ విశ్వాసం తనకుందన్నారు. ఇరత పార్టీలు తమతో పొత్తు పెట్టుకునేందుకు ఇష్టపడితే అధికారాన్ని పంచుకోవడానికి తాము సిద్ధమని విజయ్ పేర్కొన్నారు. 

రసవత్తరంగా అసెంబ్లీ ఎన్నికలు

2021 ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యూలర్ ప్రొగ్రెస్సివ్ అలియన్స్ (ఎస్‌పీఏ) 159 సీట్లు గెలుచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇదే సమ యంలో ఎన్‌డీఏ కూటమికి 75 సీట్లు వచ్చాయి. ఎన్‌డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసిన ఏఐఏడీఎంకే 66 స్థానాల్లో విజయం సాధించింది. కాగా.. ఈ ఎన్నిక ల్లో ఎలాగైన విజయం సాధించి రాష్ట్రం లో అధికారంలోకి రావాలని ఎన్‌డీఏ కూటమి పక్ష ఏఐఏడీఎంకే బలంగా ప్రయ్నతిస్తోంది.

ఇందుకోసం కేంద్రంలో ని బీజేపీ కూడా తన సహాయ సహకారాలను అందిస్తోంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారాన్ని పదిలపర్చుకోవాలని డీఎం కే పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అగ్ర హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఆయన రాజకీ యరంగ ప్రవేశం ఏ పార్టీకి మేలు చేస్తుం ది, ఎవరికి కీడు చేస్తుందనే విషయం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార డీఎంకే పార్టీకి మేలు జరుగుతుందా లేక ఏ పార్టీకీ మెజారిటీ సీట్లు రాక హంగ్ ఏర్పడి అనిశ్చితి వాతావరణం నెలకొంటుందా అనే అంశంపై చర్చ నడుస్తోంది.