calender_icon.png 16 January, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా ద్రవిడ్

07-09-2024 01:33:44 AM

ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని రాయల్స్ యాజమాన్యం ‘ఎక్స్’ వేదికగా పంచు కుంది. ‘2011 నుంచి 2015 వరకు ద్రవిడ్ రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా, మెంటార్‌గా సేవలందించాడు. మళ్లీ అదే రాయల్స్‌కు ప్రధాన కోచ్‌గా రానున్నాడు. రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కరతో కలిసి జట్టును ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాం’ అని రాజస్థాన్ రాయల్స్ తెలిపింది. ది వాల్‌గా పేరు పొందిన రాహుల్ ద్రవిడ్ 2012, 2013 సీజన్లలో రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనంతరం 2104, 2015లో అదే జట్టుకు మెంటార్‌గా పని చేశాడు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం టీమిం డియా హెడ్ కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే.