calender_icon.png 19 April, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటకాలు వాస్తవ జీవితాల్ని ప్రతిబింబిస్తాయి

18-04-2025 12:00:00 AM

ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 17 (విజయక్రాంతి): సమాజంలో మంచి చెడులను తెలియచేసే విదంగా నాటకాల ప్రదర్శన వా స్తవ జీవితాల్ని ప్రతిబింబిస్థాయని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. తెలుగు నాటక రంగ దినోత్సవ సందర్భంగా  కందనూలు కళా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో  నిర్వహించిన చింతామణి నాటక ప్రదర్శనలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 

సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను వివిధ కళా ప్రదర్శన ద్వారా కళాకారులు ప్రజల్లోకి తీసుకెళుతున్నారని, మానసిక ఆహ్లాదంతో పాటు, సందేశాన్ని కూడా  అందిస్తున్న నాటకాలు ఎంతో గొప్పవన్నారు.నాటక రంగానికి సేవ చేస్తున్న మహబూబ్ నగర్ చెందిన రిటైర్డ్ ఎంపీడీవో వి. నారాయణను కళా సేవా పురస్కారంతో సత్కరించారు. ఈ నాటకంలో ప్రముఖ పాత్రలో బి.నర్సింహారెడ్డి, జి.విష్ణుమూర్తి, చిలువేరి వెంకటయ్య, డి. రాములు, జి.మురళీధర్ రావు, వనజ కుమారి, తిరుమలాభి, ఝాన్సీ, రాంకిషన్ రావు, కౌశిక్ చారి నటించారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఆర్. సత్యం జిల్లా నాటక సమాజాలా సమాఖ్య అధ్యక్షులు నిర్వహించగా సంస్థ సభ్యులతో పాటు జిల్లాలోని కళాకారులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.