calender_icon.png 27 February, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన డ్రామా జూనియర్స్

27-02-2025 01:42:48 AM

ఘనంగా ఉదయ మెమోరియల్ పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాలు

జడ్చర్ల, ఫిబ్రవరి 26: ఉదయ మెమోరియల్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సంద ర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. చం ద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు వివిధ ఆటపాటలతో అం దులో భాగంగా డ్రామా జూనియర్స్ కలను ప్రదర్శించిన చిన్నారులు సామాజిక అంశాలపై, ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అని అంశంపై డ్రామా వేసి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాదిమి వీణ, మాది సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాధిమి శివకుమార్, రవిశంకర్, ధ్రువ, సూరిశెట్టి పవన్, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.