03-04-2025 12:00:00 AM
హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 2: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయిస్తానని కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి తెలిపారు. డివిజన్‌లోని వెంకటేశ్వర కాలనీలో జరుగు తున్న భూగర్భ డ్రైనేజ్ పనులను బుధ వారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భం గా కాలనీవాసులతో మాట్లాడి, ఇతర సమ స్యలు తెలుసుకున్నారు. వెంకటేశ్వర కాలనీ లో పూర్తిస్థాయిలో భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ సదుపాయం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు
హయత్ నగర్ డివిజన్ లోని సూర్య నగర్ కాలనీ ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం కార్పొరేటర్ నవజీవన్ రెడ్డిని కలిశారు. అధ్యక్షుడు యాదగిరి గౌడ్, కార్యవర్గ సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. సూర్య నగర్ కాలనీలో ప్రధాన రోడ్డు సమస్యను ఎంపీ ఈటల రాజేందర్ సాయంతో పరిష్కరించానని తెలిపారు.
రానున్న రోజుల్లో కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సూర్య నగర్ కాలనీ ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షు డు అయితగోని యాదగిరి గౌడ్, జనరల్ సెక్రటరీ యాదగిరి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ దశరథ రెడ్డి, సంపత్ కుమార్, యాదిగిరా చారి, కోశాధికారి వెంకటయ్య గౌడ్, అమృతారెడ్డి, కోటి నాయక్, రాజవర్ధన్ రెడ్డి, యాదగిరి, సుధాకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, శంకర్, రుద్ర కృష్ణ, మల్లేశ్, వెంకేటేష్ గౌడ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.