calender_icon.png 16 February, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచినీటిలో డ్రైనేజీ వాటర్

15-02-2025 01:34:22 AM

అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం  

  • రోగాలు వస్తే బాధ్యత ఎవరిదని మండిపాటు 

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి) :  మంచినీటిలో డ్రైనేజీ నీరు కలుస్తుందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీలో ని సాయిరామ్ నగర్ కాలనీలో ఈ దుస్థితి నెలకొంది. రోడ్డు నెంబర్ 7 -11 లో డ్రైనేజీ నీరు రోడ్లపై ఏరులై పారుతోందని స్థానికులు మండిపడుతు న్నారు.

తాము రోగాల బారిన పడుతు న్నామని చెబుతున్నారు. ఈ సమస్యపై మణి కొండ మున్సిపాలిటీ అధికారులకు, జలమండలి అధికారులకు రెండు సంవత్స రాలుగా ఫిర్యాదు చేస్తున్నా తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులు దులిపేసుకుం టున్నారని అంటున్నారు.

డ్రైనేజీ నీరుతో రోగాల బారిన పడితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మొద్దు నిద్ర వీడి సత్వరమే స్పందించి చర్యలు తీసుకో వాలని కోరుతున్నారు. ప్రతిరోజు ఉదయం దుర్వాసన వస్తుందని చెబుతున్నారు. రోగాలు ప్రబలక ముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.