30-03-2025 12:00:00 AM
ఎల్బీనగర్, మార్చి 29 : మన్సూరాబాద్ డివిజన్ లోని వీరన్న గుట్టలో ఆదివారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పర్యటించి, డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. వీరన్న గుట్ట కాలనీ ఉత్తర భాగంలో ఉన్న బస్తీ దవాఖాన పక్కన పది కాలనీలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 150 ఇండ్లకు డ్రైనేజీ ఔట్ లేట్ లేదు.
ప్రైవేట్ స్థలం నుంచి డ్రైనేజీ పైపులైన్ వేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో స్థల యజమాని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సన్నిహితులు. దీంతో స్థల యజమాని రాజేందర్ తమ్ముడు జితేందర్ ను ఇక్కడికి పిలిపించి, ప్రజల డ్రైన్స్ సమస్య వివరించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తితో కొంత స్థలం ఇవ్వడానికి అంగీకరించారు.
స్థల సమస్య తీరడంతో దాదాపు 560 ఫీట్ల పొడుగు రెండు ఫీట్ల డయా పైపులైన్ వేస్తారని తెలిపారు. డ్రైన్స్ సమస్యకు పరిష్కారం కావడంతో కాలనీవాసులు స్థల యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వాతి రెసిడెన్సీ దగ్గర ట్రంక్ లైన్ పనులపై అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్ తహసీ ల్దార్లు, సర్వేయర్లతో చర్చించామని చెప్పారు.
ట్రంక్ లైన్ ఔట్ లేట్ కలపడంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం కొందరు ఔట్ లెట్ విషయంలో అడ్డుపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. బాలాజీ నగర్, లక్ష్మీ భవాని కాలనీ, టీ నగర్, కేవీఎన్ రెడ్డి కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, అంజలి రెసిడెన్సీ, స్వాతి రెసిడెన్సీ, లక్ష్మీ ప్రసన్న కాలనీ తదితర కాలనీల్లో అధికారులు పర్యటించి, ట్రంక్ లైన్ పనుల్లో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొ రేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగొని శ్రీధర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్, చంద్రారెడ్డి, నర్సింగ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, ఆకుల సత్యం, మహేందర్, నాగార్జున రెడ్డి, సురేశ్ రెడ్డి, శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులు శుక్లాజ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.