calender_icon.png 1 April, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వారకాపురంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి

29-03-2025 09:01:17 PM

చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా..

ఎల్బీనగర్: చైతన్యపురి డివిజన్ లోని ద్వారకాపురం కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా కోరారు. ఆదివారం కాలనీలో ఆయన పర్యటించి, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతాన్నారు. సమస్యను డీజీఎం రవి వర్మకి వివరించి, 14 మీటర్ల డ్రైనేజీ పైపులైన్ ను మెయిన్ ట్రంక్ లైన్ తో కలపాలని కోరారు. కార్యక్రమంలో జలమండలి లైన్ ఇన్స్పెక్టర్ సురేందర్, డ్రైన్స్ ఇన్ చార్జి శ్రీకాంత్, కాలనీ పెద్దలు నారాయణరావు, శంకర్, శాస్త్రి, బీజేపీ నాయకులు నవీన్ యాదవ్, పవన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.