22-04-2025 12:20:54 AM
ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేసిన డ్రాగన్ కంట్రీ
షాంఘై: అమెరికా విధించిన టారిఫ్‌ల నుంచి బయటపడాలంటే ప్రపంచ దేశాలు అమెరికాతో ఆర్థిక సంబంధాలకు స్వస్తి పలకాలని ట్రంప్ ప్రభుత్వం షరతు విధించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా చైనా స్పందించింది. ప్రపంచ దేశాలకు హ్చెరికలు కూడా పంపింది. ‘చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటే మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అటువంటి పరిస్థితులను ఎప్పటికీ అంగీకరించం. పులి చర్మం కోసం పులితోనే డీల్ చేసుకోవడం ఎలాంటిదో ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి లాభం పొందాలని అనుకోవడం అటువంటిది. బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదు. రాజీ పడితే గౌరవం ఎప్పటికీ లభించదు’ అని చైనా పేర్కొంది. చైనాపై ట్రంప్ భారీగా టారిఫ్‌లు విధించగా.. చైనా కూడా అదే రీతిలో అమెరికాపై పన్నుల మోత మోగించింది.