calender_icon.png 27 October, 2024 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండండి

02-09-2024 08:36:19 PM

వర్షాల వల్ల ప్రభావితం అయిన రోడ్లు, కాలువలు మరమ్మతులకు చర్యలు తీసుకోండి ....

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

మండల, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, (విజయక్రాంతి): జిల్లాలో భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరుగకుండా మరో రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి అందరూ మండల, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల వల్ల జరిగిన నష్టాలు, ప్రస్తుతం అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలో భారీ వర్షాలు నమోదు అయిందప్పటికిని ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నందుకు అధికారులు, సిబ్బందిని అభినందించారు.  మరో రెండుమూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన నష్టాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి రేపు సాయంత్రంలోగా సమర్పించాలని సూచించారు. రోడ్ల పునరుద్ధరణ, కాలువల మరమ్మతులు వేగంగా జరగాలని ఆదేశించారు.

శిధిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి అందులో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరం అయిన వాటికి నోటీసులు ఇచ్చి కులగొట్టాలని చెప్పారు.  ఇప్పటికే వర్షాల వల్ల కూలిపోయిన ఇళ్ల యజమానులు నుండి పరిహారం కొరకు దరఖాస్తులు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పంచనామా, జి.పి.ఎస్ ఫోటోలు తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాల్సినదిగా సూచించారు.  రిలీఫ్ క్యాంప్ కు తరలించిన వారికి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇకనుండి  మంగళవారం, శుక్రవారం వారానికి రెండు రోజులు డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. ప్రజలకు సైతం పారిశుధ్యం, నీరు వేడి చేసి చల్లార్చి తాగడం వంటి విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. 

సెప్టెంబర్ 6వ తేదీన గ్రామపంచాయతీల్లో డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పెట్టాలి

స్థానిక ఎన్నికల సన్నద్ధత లో భాగంగా వార్డుల వారీగా ఎలక్టరల్ రోల్ సిద్ధం చేసి ముసాయిదా ఎలక్టరల్ రోల్ సెప్టెంబర్ 6వ తేదీన అన్ని గ్రామపంచాయతీ భవనాల్లో, ఎంపీఒ, ఎంపీడీఓ, డి.పి. ఒ కార్యాలయాల్లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 10వ తేదీన  పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో మండల స్థాయిలో సమావేశం నిర్వహించి ఎలక్టరల్ రోల్ పై వివరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, ఆర్డీఓ పద్మావతి, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపిఒ లు తదితరులు పాల్గొన్నారు.