calender_icon.png 30 November, 2024 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు స్టాండింగ్ కమిటీకి ముసాయిదా బడ్జెట్

30-11-2024 12:46:33 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): జీహెచ్ ఎంసీ 2025 ఏడాదికి రూ. 8340 కోట్ల ప్రణాళికలతో బడ్జెట్‌ను తయారు చేసింది. ఈ బడ్జెట్‌లో గతేడాది (2024 కంటే రూ.400 కోట్లు అదనంగా కేటాయింపులు చేశారు. ఈ ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలను నేడు శనివారం స్టాండింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది. ఆ తర్వాత జనవరిలో జరగనున్న జనరల్ బాడీ సమావేశం ఆమోదానికి సిఫార్సు చేయనుంది.

గత ఏడాది రూ.7937 కోట్ల బడ్జెట్‌ను రూపొందించగా, ఈ ఏడాది రూ. 8340 కోట్లతో బడ్జెట్ తయారు చేశారు. అయితే, గతేడాది రూ. 7937 కోట్ల బడ్జెట్‌ను.. రూ. 8150 కోట్లుగా బల్దియా అప్‌డేట్ చేసింది. ఇది రూ. 213 కోట్లు అదనంగా పెంచినట్టు స్పష్టమవుతుంది. నేడు జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో గతేడాది పెరిగిన బడ్జెట్ కూడా ఆమోదం పొందనుంది.