భూసేకరణ చట్టాన్ని చేసిన మార్పులు తొలగించి అమలు చేయాలి..
వద్ద రైతులు, భూ నిర్వాసితుల మహాధర్నా..
పార్టీ(ఇండియా) తెలంగాణ అధ్యక్షురాలు సుభద్రారెడ్డి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): డాక్టర్ స్వామినాథన్ సిఫార్సును అమలు చేసి, 2013 భూసేకరణ చట్టాన్ని చేసిన మార్పులు తొలగించి అమలు చేయాలని సోషలిస్టు పార్టీ (ఇండియా) తెలంగాణ అధ్యక్షురాలు రచ్చ సుభద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో సోషలిస్టు పార్టీ(ఇండియా) తెలంగాణ, భూ నిర్వాసితుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రైతుల సమస్యలను పరిష్కరించి, భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, భూ నిర్వాసితులు పెద్ద సంఖ్యలో హాజరై మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షోలిస్టు పార్టీ(ఇండియా) తెలంగాణ అధ్యక్షురాలు సుభద్రారెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్ట్‌ల కోరకు కంపెనీల కోసం రైతుల నుండి తీసుకున్న భూమికి పరిహారం వెంటనే చెల్లించాలని అన్నారు.
రైతులు పండించిన పంగలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. అన్ని రకాల పంటలు ప్రభుత్వమే కొనాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు ఎరువులు ప్రభుత్వమే సరఫరా చేయాలని అన్నారు. రైతు బీమా వయసు 58 నుండి 65 కు పెంచాలని అన్నారు. రైతుబంధు వెంటనే విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీరటి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్వి పంతులు అనంతం. రమేష్ నాయుడు, రెడ్డయ్య, బాలయ్య, జి. ఎల్లేష్, ఎండీ యూసఫ్, దయాకర్, నర్సింహులు తదితర రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.