10-03-2025 07:50:25 PM
సిద్దిపేట (విజయక్రాంతి): స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో సిద్దిపేటకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ రచించిన రెండు పుస్తకాలు జువాలజీ ఈజీ మేడ్ అక్వాటిక్ బయాలజీ, జువాలజీ ఈజీ మేడ్ సెరికల్చర్ అనే రెండు పుస్తకాలను ప్రతిభ డిగ్రీ కళాశాల లైబ్రరీకి అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ... ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ తో విడుదలైన ఈ రెండు పుస్తకాలు డిగ్రీ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.
డా.శ్రీకాంత్ ఈ రెండు పుస్తకాలలో అక్వాటిక్ బయాలజీ, సెరికల్చర్ అంశాలను చక్కగా వివరించారు. విద్యార్థులు చక్కగా వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ... విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. ఉద్యోగాలు సాధించే దిశగా కష్టపడాలన్నారు. తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పివి రావు, శ్రీకాంత్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.