హైదరాబాద్, నవంబర్ 28: తల, మెడ భాగంలో అరుదుగా క్యాన్సర్ రూపంలో వచ్చే నాసోఫారైజీల్ కార్సినోమా (ఎన్‌పీసీ) చికిత్స కోసం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ కొత్త ఔషధాన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త బయోలాజికల్ ఎంటిటీ అయిన తొరిపలిమాబ్‌ను విడుదల చేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఇది యూఎస్‌ఎఫ్‌డీఏ, ఈఎంఏ, ఎంహెచ్‌ఆర్‌ఐ తదితర ప్రపంచ డ్రగ్ రెగ్యులేటర్లు ఆమోదించిన ఏకైక ఇమ్యునూన్‌కాలజీ డ్రగ్ అని కంపెనీ తెలిపింది. జైటోర్వి బ్రాండ్‌నేమ్‌తో ఈ ఔషధాన్ని మార్కెట్ చేయనున్నట్లు వెల్లడించింది.