28-04-2025 05:14:34 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చారు. పట్టణంలోని 15వ వార్డు అధ్యక్షులు విరుగరాల గిరి, 17వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు మల్లంపల్లి మల్లయ్యలు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న చెన్నూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి రాజా రమేష్ సోమవారం పట్టణ నాయకులతో కలిసి వెళ్ళి వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధైర్య పడవద్దని పార్టీ అండ గా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడికేల సంపత్ కుమార్, ఓ రాజశేఖర్, మేడిపల్లి సంపత్, కనకం రవీందర్,పల్లె నర్సింహులు, రామసాని శేఖర్ లు పాల్గొన్నారు.