రెగ్యులర్ పోస్ట్‌ను మంజూరు చేసిన సర్కార్
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ డైరెక్టర్ (డీఎంఈ)గా డాక్టర్ నరేంద్రకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. నరేంద్రకుమార్ ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.
మెడికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ డైరెక్టర్‌గా డాక్టర్ శివరామ్‌ప్రసాద్‌ను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం జగిత్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా, అకాడమిక్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగాల పంపకంలో భాగంగా డీఎంఈ పోస్టును ఏపీకి కేటాయించారు.
గత ప్రభుత్వం డీఎంఈ పోస్ట్‌ను సృష్టించకుండా, ఇన్‌చార్జిలతోనే నెట్టుకొచ్చింది. పదేండ్ల తర్వాత పోస్టును క్రియేట్ చేసి, సీనియర్ అడిషనల్ డీఎంఈని రెగ్యులర్ డీఎంఈగా ప్రభుత్వం నియమించింది.
ప్రతీ జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణలో ఇన్నాళ్లుగా ఇన్‌చార్జిలతోనే కీలకమైన డీఎంఈ పోస్టును నెట్టుకురాగా.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కీలకమైన నిర్ణయం తీసుకుందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.