20-03-2025 02:24:22 AM
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ కొత్త వైస్ చాన్సలర్‌గా డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. దీంతో బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
నందకుమార్ రెడ్డి 32 సంవత్స రాలుగా వైద్య రంగంలో వివిధ హోదాల్లో పనిచేశారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. నారాయణపేట జిల్లాకు చెందిన ఈయన హెల్త్ వర్సిటీ వీసీగా మూడేండ్లపాటు కొనసాగనున్నారు.