calender_icon.png 3 April, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం ఓ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్

02-04-2025 08:54:19 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): ఆర్‌జి-1 ఏరియా హాస్పిటల్ నందు ఏ‌సి‌ఎం‌ఓ గా పనిచేస్తూ, ఇటీవల సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా నియామకమైన డాక్టర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్, బుధవారం రోజున కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భముగా ఏ‌సి‌ఎం‌ఓ ఎం.ఉష, డి‌వై.సి‌ఎం‌ఓ, జి.సునీల, డాక్టర్లు, సి‌ఎం‌ఓ‌ఏ‌ఐ ప్రతినిధులు, అధికారులు మెయిన్ హాస్పిటల్ సిబ్బంది, యూనియన్ నాయకులు నూతన సీఎం ఒ కు శుభాకాంక్షలు తెలిపారు. ఐఎన్టియుసి, రజాక్ నూతనంగా సీఎంఓ గా పదవి బాధ్యతలు చేపట్టిన, డాక్టర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసారు.