calender_icon.png 2 April, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

29 న డాక్టర్.దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు

26-03-2025 12:34:31 AM

వనపర్తి టౌన్, మార్చి 25 ( విజయక్రాంతి )  సాహితీ కళావేదిక మరియు తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యములో   మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 29 న దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు మహాకవి డాక్టర్.దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడతాయని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ తెలిపారు.

దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వేడుకల సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం మాజీమంత్రి నిరంజన్ రెడ్డి  ఆయన స్వగృహంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దాశరథి కృష్ణమాచార్య రచనలు ఈ తరానికి రాబోవు తారలకు స్ఫూర్తిదాయకం కావాలని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ,తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.  ఈ కార్యక్రమంలో  నాయకులు తదితరులు పాల్గొన్నారు.